
సరికొత్త ప్రయత్నాలతో, ప్రయోగాలతో దర్శకుడు తేజ సంపాదించిన పేరు, సృష్టించిన సినిమాలు మామూలు విషయాలు కాదు. ఒకప్పుడు అంతా కొత్తవాళ్ళతోనే వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ఘనత తేజకు దక్కుతుంది. అయితే తాజాగా ఆయన సినిమాలేవీ ఆ ప్రాభవాన్ని చూపలేకపోయాయ్! వరుస అపజయాల తర్వాత మళ్ళీ ఓ సరికొత్త ప్రయత్నంతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తేజ.
ప్రస్తుతం దర్శకుడు తేజ హోరా హోరీ పేరుతో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ మొత్తాన్ని తెలంగాణ వారిని ఎంపిక చేయడం విశేషం. తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి ఈ సిబ్బందిని ఎంపిక చేశారట ఈ రకంగా ఈ సినిమా ఓ సరికొత్త ప్రయత్నంగానే చెప్పాలి. దిలీప్, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

