తెలంగాణ సినీఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘స్టార్ క్రికెట్’

తెలంగాణ సినీఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘స్టార్ క్రికెట్’

Published on Jul 13, 2015 1:00 PM IST

cricket
తెలంగాణ సినీఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించబోతున్నది. ‘కాకతీయ కప్’ పేరుతో మ్యాచ్ ను నిర్వహించనున్నారు. తెలంగాణ స్టార్స్ Vs చెన్నై హీరోస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక తెలంగాణ స్టార్స్ జట్టుకు జై ఆకాష్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. చెన్నై హీరోస్ జట్టుకు జీవా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్ ఆగస్టు 9న ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కు అందజేయనున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. 9 వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మ్యాచ్ జరుగుతుందని.. ప్రేక్షకుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, జబర్దస్త్ టీమ్ కామెడి షో కూడా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

ఇక టీమ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి

తెలంగాణ స్టార్స్ : జై ఆకాష్ (కెప్టెన్), నిఖిల్, సందీప్ కిషన్, మనోజ్ నందన్, ప్రిన్స్, శివారెడ్డి, సంపత్ కుమార్, సంగ అభినయ్, సంపూర్నేష్ బాబు, నాగరాజు (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్), అశ్వని (జీనియస్), ధనరాజ్, సత్యం రాజేష్, నల్లవేణు, దిలీప్.
చెన్నై హీరోస్ : జీవా (కెప్టెన్), ఆర్య, విశాల్, శ్యామ్, భరత్, రమణ, విష్ణు, విక్రాంత్, పృథ్వి, అశోక్ సెల్వన్, నందన్ భాగ్యరాజ్

తాజా వార్తలు