
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఒక ఇంటి సెట్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. ప్రస్తుతం కృష్ణవంశీ రామ్ చరణ్ పై కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో హైలైట్ గా నిలవనున్న ఈ సన్నివేశాలని ప్రత్యేక శ్రద్ధతో చిత్రీకరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రానికి యువన్ రాజ అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.