తెలంగాణలో థియేటర్లు మూసివేత.. ‘వకీల్ సాబ్’ మాత్రమే

తెలంగాణలో థియేటర్లు మూసివేత.. ‘వకీల్ సాబ్’ మాత్రమే

Published on Apr 20, 2021 10:00 PM IST

ఇప్పటికే ఏపీలో సినిమా హాళ్ల మీద 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను విధించారు. ఇక రేపటి నుండి తెలంగాణలోని థియేటర్ల మీద కూడ ఆంక్షలు నడవనున్నాయి. రేపటి నుండి అనగా 21 వ తేదీ నుండి 30వ తేది వరకూ సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించుకుంది. ఈ మేరకు కార్యదర్శి విజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అసోసియేషన్‌ సభ్యులు సమావేశమయ్యారు. ప్రేక్షకుల క్షేమం గురించి ఆలోచించి స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసలే తెలంగాణలో విధించిన నైట్ కర్ఫ్యూ కారణంగా సెకండ్ షోలు రద్దయ్యాయి. దీంతో సాయంత్రం 8 గంటలకే సినిమా హాళ్లు మూసివేయాల్సిన పరిస్థితి. పైగా ఈ వారం వేరే పెద్ద సినిమాల విడుదలలు లేవు. దీంతో ఈ నెలాఖరు వరకు సినిమా హాళ్లను క్లోజ్ చేయాలని నిర్ణయించారు. కానీ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ప్రదర్శించే కొన్ని థియేటర్లకు మాత్రం మినహాయింపును ఇచ్చారు. అవి మాత్రం రోజుకు మూడు షోల చొప్పున నడవనున్నాయి. అది కూడ ఈ వారాంతం వరకు మాత్రమే. ఆ తర్వాత అవి కూడ మూతబడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు