“మైల్స్ ఆఫ్ లవ్” రెండవ పాట కు కూడా మంచి స్పందన !!

“మైల్స్ ఆఫ్ లవ్” రెండవ పాట కు కూడా మంచి స్పందన !!

Published on Jan 28, 2021 10:00 AM IST

అభినవ్ మేడిశెట్టి హీరోగా రమ్య పసుపులేటి హీరోయిన్ గా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం “మైల్స్ ఆఫ్ లవ్”. రామ్ కామ్ బాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీత సారథ్యం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘గగనం దాటే’ తొలి పాటను జీ సరిగమ ఫేమ్ యశస్వి ఆలపించగా నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ పాట వన్ మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని రెండో మిలియన్స్ కి రీచ్ అవుతోంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘తెలియధే.. తెలియధే’ రెండవ పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేయగా అది 6.5 లక్షల వ్యూస్ సాధించి వన్ మిలియన్ కు రీచ్ అవుతోంది.

ఇలా రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ, మ్యూజిక్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న మైల్స్ ఆఫ్ లవ్ చిత్రం అందరికీ నచ్చుతుందని.. దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్ గా తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా; రవిమణి కె.నాయుడు, సంగీతం; ఆర్.ఆర్.ధ్రువన్, ఎడిటర్; బి.నాగిరెడ్డి, రచన-దర్శకత్వం; నందన్, నిర్మాత; రాజిరెడ్డి.

పాట చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు