‘ఒడిస్సీ’కి బాగా కనెక్ట్ అవుతున్న తెలుగు ఆడియెన్స్! కారణాలు ఇవే

లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో ఒకటే హాలీవుడ్ సినిమా “ది ఒడిస్సీ” కూడా ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పూర్తిగా తన ట్రాక్ మార్చి చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ హాలీవుడ్ సహా ఇండియాలో కూడా మంచి హైప్ నడుమ విడుదల అయ్యింది.

ఇండియాలో పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా మన తెలుగులో కూడా వచ్చింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ గట్టిగా కనెక్ట్ అవుతున్నారు. మెయిన్ గా సినిమా మన తెలుగు మాస్ సినిమా టైప్ లోనే ఉండడం మూలాన కాబోలు ఈ చిత్రానికి వారు మంచి స్పందన అందిస్తున్నారు.

పైగా తెలుగు డబ్బింగ్ కూడా బాగుందని చెబుతున్నారు. మన దగ్గర కూడా ఆల్రెడీ సాలిడ్ హిస్టారికల్ సినిమాలు, ఫాంటసీ సినిమాలు ఉండడం, ఈ తరహా సినిమా క్రిస్టోఫర్ నోలన్ లాంటి దర్శకుడు నుంచి రావడం అనేది మరింత ఎగ్జైటింగ్ గా మార్చింది. దీంతో తెలుగు వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ ఇపుడు నమోదు అవుతుంది.

Exit mobile version