‘కమెడియన్స్’ సీరియస్ గానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు !

Published on Mar 10, 2019 12:09 pm IST

టాలీవుడ్ లో కమెడియన్లు అందరూ ఫ్లయింగ్ కలర్స్ అని ఓ గూప్ర్ ను ఫామ్ చేసుకుని అప్పుడప్పుడు కలుస్తూ సరదాగా గడుపుతుంటారు. ఈ గ్రూప్ లో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, నందు, సప్తగిరి, తాగుబోతు రమేశ్, ధనరాజ్, వేణు, సత్య, రఘు, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, ఇంకా మరొకొందరు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ వారానికో, నెలకో ఒకసారి కలుస్తూ ఒకరికి ఒక్కరూ పార్టీలు ఇచ్చుకుంటూ ఐకమత్యంగా ఉంటున్నారు. తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకున్నారు.

కాగా తాము కలుసుకున్నప్పుడు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోలో అందరూ పంచె కట్టుతో ఒకే డ్రెసింగ్ స్టైల్ తో కనిపిస్తూ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటున్నారు. అన్నట్లు ఇటీవలే ఈ గ్రూపు పేరు అయిన ఫ్లయింగ్ కలర్స్ పేరుతో ఓ బ్యానర్ ను కూడా స్టార్ట్ చేశారు శ్రీనివాస రెడ్డి.

ఇక ఈ బ్యానర్ పై శ్రీనివాస రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఈ గ్రూపు మెంబర్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. మొత్తానికి కమెడియన్స్ అందరూ కలిసి సీరియస్ గానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :