సల్మాన్ ఖాన్ మీద కన్నేసిన తెలుగు స్టార్ డైరెక్టర్

Published on Apr 8, 2021 7:18 pm IST

‘బాహుబలి’ సిరీస్ తర్వాత టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. అన్ని ఇండస్ట్రీలకంటే తెలుగు ఇండస్ట్రీనే టాప్ పొజిషన్లోకి చేరిపోయింది. ఇక్కడ రూపొందే సినిమాలకి అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా హిందీ భాషలో క్రేజ్ మామూలుగా లేదు. ప్రజెంట్ హిందీ ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాలు తెలుగు సినిమాలే. దక్షిణాది డైరెక్టర్లు అంటే అక్కడి వారికి మంచి గురి ఏర్పడింది. హిందీ హీరోలు సైతం సౌత్ ఫ్లేవర్ సినిమాలు కోరుకుంటున్నారు. కానీ హిందీలో అలాంటి కథలు రాయగల డైరెక్టర్లు కరువయ్యారు. మాస్ పల్స్ పట్టుకునే వారు తక్కువ.

అందుకే హిందీ స్టార్ హీరోలు సౌత్ దర్శకుల మీద కన్నేశారు. ఇప్పటికే షారుక్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేయనున్నారు. ఇది కంప్లీట్లీ సౌత్ ఫ్లేవర్ సినిమా. దీన్ని పసిగట్టిన మన తెలుగు డైరెక్టర్ ఒకరు నేరుగా సల్మాన్ ఖాన్ కోసమే కథ రాస్తున్నారట. ఆ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ జానర్లో సినిమాలు చేసే ఆ డైరెక్టర్ సల్మాన్ ఖాన్ కోసం ఒక యాక్షన్ కథ రాస్తున్నారట. ఎలాగైనా సల్మాన్ ఖాన్ వరకు కథను తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారట. అన్నీ కుదిరితే సినిమా కూడ సెట్ అవుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :