తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించేలా ‘గోవిందుడు..’ – బండ్ల గణేష్.

తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించేలా ‘గోవిందుడు..’ – బండ్ల గణేష్.

Published on Sep 25, 2014 1:09 PM IST

Bandla-Ganesh
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వంలో పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల నిర్మాత గణేష్ చాలా నమ్మకంతో ఉన్నారు.

‘అత్తారింటికి దారేది’, ‘బొమ్మరిల్లు’ సినిమాల తరహాలో ‘గోవిందుడు అందరివాడేలే’లో చివరి 30 నిముషాలు సినిమాకి చాలా కీలకం. ఆ సెంటిమెంట్ ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. సినిమానే జీవితంగా సినిమానే ప్రాణంగా ప్రేమతో సినిమాని సృష్టించే కృష్ణవంశీ మా సంస్థ ద్వారా ‘గోవిందుడు అందరివాడేలే’ అందించడం మాకు గర్వకారణం. సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించేలా ఈ సినిమా ఉంటుంది అని నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. చరణ్ కెరీర్ లో నెంబర్ 1 ఫిల్మ్ అవుతుందని అన్నారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా వార్తలు