అవుట్ స్టాండింగ్ గా ఉన్న ప్రశాంత్ వర్మ “జాంబీ రెడ్డి” ఫస్ట్ బైట్.!

అవుట్ స్టాండింగ్ గా ఉన్న ప్రశాంత్ వర్మ “జాంబీ రెడ్డి” ఫస్ట్ బైట్.!

Published on Dec 5, 2020 11:15 AM IST

తన మొట్ట మొదటి సినిమాతో నేషనల్ లెవెల్లో అప్లాజ్ ను అందుకున్న తెలుగు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగాత్మక చిత్రం “జాంబీ రెడ్డి”. ఆ మధ్య కరోనా డేంజర్ బెల్స్ సమయంలో అనౌన్స్ చేసిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. మొట్ట మొదటిసారిగా మన తెలుగులో జాంబీల నేపథ్యంలో అది కూడా మన నేటివిటీకి తగ్గట్టుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం పట్ల ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తిని కనబర్చారు.

మరి ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ సినిమా తాలూకా ఫస్ట్ బైట్ ఇప్పుడు సమంతా చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఇది మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. దైవం చేసిన మానవ సృష్టిలో అతడికి ఇచ్చిన మేథా శక్తిని అదే దైవానికి ప్రశ్నగా మారిస్తే నేర్పిన గుణపాఠమే ఇది అన్నట్టుగా ఈ టీజర్ లో చూపించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు వాక్సిన్ కనుక్కునే క్రమంలో మనిషి చేసిన ప్రయోగ వైఫల్యం వల్ల వారు జాంబీలుగా ఎలా స్థిరపడ్డారో అన్నట్టుగా ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.

ఇక వారిని అడ్డుకొనే హీరోగా యువ హీరో తేజ సజ్జ హీరోయిన్ ఆనందితో కలిసి ఇంప్రెస్ చేసాడు. ఇక అలాగే ఇందులో విజువల్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మన తెలుగులో మొట్ట మొదటి జాంబీ స్టోరీ ఇది అలాంటప్పుడు ఆ జాంబీలను ఎలా చూపిస్తారు ఎలా డీల్ చేస్తారు అన్నది ఆసక్తికర ప్రశ్న దానికి ఈ టీజర్ లో మంచి ఆన్సర్ ను దర్శకుడు ఇచ్చాడు.

ఒక పక్క హాలీవుడ్ తరహా టేక్ మరియు రియలిస్టిక్ జాంబీల విజువల్స్ తో వాటిని మన తెలుగు నేటివిటీకి మిక్సప్ చేసి చూపించడం బాగుంది. ఇక మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రాఫర్ అనిత్ పనితనం కానీ చాలా బాగున్నాయి. అలాగే రాజశేఖర్ వర్మ నిర్మాణ విలువలు ఈ ప్రయోగానికి అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. తన లాస్ట్ చిత్రాలు “అ!”, “కల్కి” లతో తెలుగు ఆడియెన్స్ మైండ్ బ్లో చేసిన ప్రశాంత్ వర్మ ఈసారి ఈ కొత్త అటెంప్ట్ తో మరోసారి సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ను ఇచ్చేలా ఉన్నాడని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు