మధురైలో తమిళ హీరోతో తెలుగు హీరో కుమార్తె !

Published on Jul 24, 2018 8:35 am IST

రాజశేఖర్, జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌, బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘2 స్టేట్స్‌’ రీమేక్‌ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవబోతున్న విషయం తెలిసిందే. కాగా ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా పక్క భాషలైన తమిళ, మలయాళ చిత్రపరిశ్రమల్లోనూ నటించేందుకు సిద్దం అవుతున్నారు. తమిళంలో వెంకటేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో విష్ణువిశాల్‌ సరసన శివాని హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం మధురైలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. వీవీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే శివాని మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ కు జోడిగా నటిస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు భాషల్లోనూ నటించడానికి శివాని రెడీ అవ్వడం నిజంగా విశేషమే.

సంబంధిత సమాచారం :