సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన యువహీరో సుధీర్ బాబు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాతో మెప్పించిన ఈ హీరో త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమా సినిమాకూ నటుడిగా తానేంటో నిరూపించుకుంటూ దూసుకెళుతోన్న సుధీర్ బాలీవుడ్‌లో ‘భాగీ’ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు జాకీ ష్రఫ్ కుమారుడు టైగర్ ష్రఫ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘భాగీ’ సినిమాలో సుధీర్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా, సుధీర్ త్వరలోనే ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే సుధీర్ బాబు, నందిని హీరో హీరోయిన్లుగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..’ ఈ నెల్లోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాయి.


