ప్రపంచ సినీ సూపర్ హీరోల నోటి నుండి తెలుగు డైలాగ్ లు !

Published on Apr 27, 2019 3:40 am IST

ప్రపంచ సినీ లోకాన్ని తమ విన్యాసాలతో సాహసాలతో ఎంతగానో అలరించిన ‘ఎవెంజర్స్’ మొత్తానికి మన తెలుగు సినిమాలను, తెలుగు డైలాగ్ లను తలా ఒకటి పంచుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలను, బాహుబలి సినిమాని ఎవెంజర్స్ లో సూపర్ హీరోలు బాగా వాడుకున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్’ అత్యధిక థియేటర్లలో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. తెలుగులో కూడా డబ్ అయింది. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెలుగు ప్రేక్షకులకు ఓన్ చేయడానికి ఈ సినిమాలోని డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు సినిమాల పేర్లను, తెలుగు సినిమాల్లోని డైలాగ్ లను వాడారు.

సినిమాలో టైం మిషన్ గురించి చెప్పే సందర్భాల్లో రెండు సార్లు బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా గుర్తు వచ్చేలా ఆదిత్య 24 అని చెప్పించారు. అలాగే సినిమాలో గతం గురించి ప్రస్తావించేటప్పుడు.. ‘సింహ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగా’ అంటూ పలికించారు. అలాగే బాలయ్య కెరీర్ లోనే ఫేమస్ డైలాగ్ అయిన ‘నీ ఇంటికొచ్చా..నీ నట్టి ఇంటికొచ్చా.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే..’ లాంటి టైపు డైలాగ్ ను కూడా సెకెండ్ హాఫ్ లో చెప్పించారు.

ఇక ఎవెంజర్స్ లో ఎవరు గొప్ప అని అనుకునే సందర్బంలో.. ‘మన బ్యాచ్ లో నేను బాహుబలి లాంటి ఎవెంజర్ ని’ అని ఓ ఎవెంజర్ ఈ డైలాగ్ చెబుతాడు. అలాగే ఈ సినిమాలో మణులు కోసం లోయ ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. గోపీచంద్ సాహసం మరియు పాత తెలుగు సినిమాలను గుర్తుకు తెచ్చేలా.. ‘ఇప్పుడు సినిమాల్లో లాగా బాణాలు మాయలు మంత్రాలు వచ్చేస్తాయి చూడు’ అని అంటాడు ఓ ఎవెంజర్. మొత్తానికి ఎవెంజర్స్ అందరూ తెలుగు డైలాగ్ లు చెప్పి.. తెలుగు సినిమాలను గుర్తుకు తెచ్చి.. తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే గతంలో ఏ సినిమాకు లేని విధంగా తెలుగు ప్రేక్ష‌కుల నుంచి కూడా ఈ సినిమాకు విశేషమై స్పంద‌న లభిస్తోంది.

సంబంధిత సమాచారం :