నిర్మాతలకు షాకిస్తున్న ఓటీటీ సంస్థలు

నిర్మాతలకు షాకిస్తున్న ఓటీటీ సంస్థలు

Published on May 6, 2021 11:10 PM IST

మొదటి లాక్ డౌన్ సమయంలో ఓటీటీ సంస్థలు బలంగా నిలదొక్కుకున్నాయి. థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు శైవుతాం ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు. దీంతో తెలుగు సినిమాలు కూడ ఓటీటీల వైపుకు అడుగులువేశాయి. ఓటీటీ సంస్థలు కూడ తెలుగు సినిమాలను గట్టిగా కొనుగోలుచేశాయి. కానీ థియేటర్లు ఓపెన్ కావడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు నెలన్నర తర్వాతనే ఓటీటీల్లో ప్రసారం చేయాలని మిర్మాతల మండలి కండిషన్ పెట్టింది. దీంతో ఓటీటీల యాజమాన్యాలు కొద్దిగా నొచ్చుకున్నాయి.

ఇలా మూడు నెలలు సాగగా ఇప్పుడు మళ్ళీ థియేటర్లు మూతబడ్డాయి. చాలా సినిమాల విడుదలలు వాయిదాపడ్డాయి. మళ్ళీ సినిమా హాళ్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. దీంతో వడ్డీలకు ఫైనాన్స్ తెచ్చిన నిర్మాతలు ఇరుకునపడ్డారు. థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వడ్డీలు కట్టడమంటే తలకు మించిన భారం. అందుకే మళ్ళీ ఓటీటీలకు వెళ్తున్నారు. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం ఇదివరకు కొన్నట్టు ఎంత ధర చెబితే అంత చెల్లించి సినిమాలను కొనడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికే వాటిని అప్రోచ్ అయిన కొందరు నిర్మాతలు లాభాల సంగతి దేవుడెరుగు పెట్టిన ఖర్చులు కూడ వచ్చేలా లేవని ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు