తెలుగు పరిశ్రమలో పర భాషా కథల హవా

Published on May 5, 2021 1:00 am IST

ఈమధ్య మన స్టార్ హీరోలు పర భాషలు కథలను ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా రీమేక్ సినిమాల హవా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలు తమిళం, మలయాళం ఇండస్ట్రీలో హిట్టైన కథలను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టారు. వాటిలో ఒకటి తమిళ చిత్రం ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. చిరు తర్వాతి రెండు సినిమాలు ఇవే.

ఇక మరొక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం రీమేక్ కథల మీదే దృష్టి పెట్టి ఉంచారు. ప్రజెంట్ ఆయన చేస్తున్న రెండు సినిమాలు రీమేక్ కథలే. తమిళ చిత్రం ‘అసురన్’ను ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేసిన ఆయన ‘దృశ్యం-2’ రీమేక్లో కూడ నటించారు. ఇవి రెండూ కాకుండా తాజాగా మరొక మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ను కూడ ఆయన రీమేక్ చేయాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అంటే వెంకీ నుండి రాబోయే తర్వాతి నాలుగు సినిమాల్లో మూడు రీమేక్ సినిమాలే.

పవన్ కళ్యాణ్ సైతం ఇదే బాటలో వెళ్తున్నారు. రీఎంట్రీ చిత్రంగా ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేశారాయన. అది కాకుండా మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుం’ రీమేక్ చేస్తున్నారు. పెద్ద హీరోలే కాదు యువ హీరోలు కూడ అదే బాటలో ఉన్నారు. నితిన్ హిందీ ‘అంధాదున్’ను తెలుగులో ‘మాస్ట్రో’ పేరుతో రీమేకే చేస్తుండగా బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ ‘కర్ణన్’ను రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోలు చాలామంది రీమేక్ కథల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :