తమిళ సినిమాకి అచ్చ తెలుగు టైటిల్ !

తమిళ సినిమాకి అచ్చ తెలుగు టైటిల్ !

Published on Jun 20, 2018 7:54 PM IST


తమిళ హీరో ‘జై’ నటిస్తున్న తాజా చిత్రానికి ‘జరుగండి’ అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. అలా అని తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించట్లేదు, ఒక్క తమిళంలో మాత్రమే ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. మరి తమిళ సినిమాకి తెలుగు టైటిల్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా..? ఆ విషయం గురించే ఆ చిత్ర దర్శకుడైన పిచ్చుమణి తెలుగు టైటిల్ ఎందుకు పెట్టారో చెప్తూ.. ‘స్క్రిప్ట్ ప్రకారం హీరో లైఫ్ లో ఏం జరిగినా చాలా వేగంగా జరిగిపోతుందట. అందుకే ‘జరుగండి’ అనే తెలుగు పదం గుర్తుకొచ్చి ఆ టైటిల్ పెట్టారట.

‘జరుగండి’ అనే పదానికి అర్ధం తమిళ వాళ్లకి కూడా చాలామందికి తెలుసు అందుకే తెలుగు పదాన్ని టైటిల్ గా పెట్టామని దర్శకుడు చెప్పారు. ఐతే టైటిల్‌ కు తమిళంలో కూడా మంచి స్పందన వస్తుంది. కేవలం నలభై ఆరు రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్‌ ను పూర్తి చేశారు. జూలై ఆఖరి వారంలో ఈ ‘జరుగండి’ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. అయితే తెలుగు టైటిల్ పెట్టుకున్న ఈ తమిళ సినిమా తెలుగులో కూడా అనువాదమయ్యే అవకాశాలు ఉన్నాయి. జర్నీ చిత్రం ద్వారా ‘జై’ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు