
ఎన్.టి.ఆర్ అభిమానులు చాలా రోజులుగా ఎన్.టి.ఆర్ ను పవర్ఫుల్ పాత్రలో చూడాలని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ దయగా ఎన్.టి.ఆర్ కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా ఆడియోని ముందుగా జనవరి 18న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం టెంపర్ ఆడియోని 18న రిలీజ్ చేయడం లేదు. మరో వారం రోజులు ఆలస్యంగా రిలీజ్ చేసే పనిలో ఈ చిత్ర టీం ఉంది. త్వరలోనే కచ్చితమైన కొత్త ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతున్న చివరి షెడ్యూల్లో ఎన్.టి.ఆర్ తో పాటు కీలక నటీనటులపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి కాగానే మిగిలి ఉన్న ఒక పాటని కూడా షూట్ చేస్తారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అప్పుడే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నాడు.