
తన అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమా అందించాలనే ఉద్దేశంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎంతో కసితో చేసిన సినిమా ‘టెంపర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బెనిఫిట్ షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయ్యింది. కేవలం టాక్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్స్ సృష్టిస్తోంది. ఒక్క ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా చెన్నై మరియు ఓవర్సీస్ లో కూడా ఫస్ట్ వీకెండ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఓవర్సీస్ లో కలెక్షన్స్ భారీగా కొల్లగొడుతోంది.
మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి $500 డాలర్స్ సాధించిన టెంపర్ మిగిలిన రోజులు కూడా అదే జోరుతో కలెక్షన్స్ వసూలు చేస్తోందని, త్వరలోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయనుందని తెలియజేశాం. చెప్పినట్టుగానీ నిన్నటితో ఈ సినిమా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. యుఎస్ లో ఈ సినిమాని రిలీజ్ చేసిన సినీ గేలక్సీ వారు తెలిపిన సమాచారం ప్రకారం టెంపర్ శనివారంతో $ 1,004,222 షేర్ ని సాధించింది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత.

