
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా యుఎస్ లో సుమారు 135 లొకేషన్లలో నేడు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. పలు లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోల ద్వారా ‘టెంపర్’ 235k డాలర్స్ వసూలు చేసింది. అమెరికాలో ఎన్టీఆర్ హిట్ సినిమా ‘బాద్ షా’ ప్రీమియర్ రోజున 234k డాలర్స్ వసూలు చేసింది. ఈజీగా మిలియన్ మార్క్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ క్యారేక్టరైజేషన్.. పూరి టేకింగ్, డైలాగ్స్.. కాజల్ గ్లామర్.. క్లైమాక్స్ ఎపిసోడ్.. సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయని అందరు అంటున్నారు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

