
ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ విజయంతో తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద కళకళలాడిపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ని రూపొందించే సూచనలు వున్నాయంట.
ఈ వార్తని బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ లో తెలిపాడు. ఈ సీక్వెల్ పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. పూరి జగన్ దర్శకుడు. టెంపర్ లో తారక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

