‘టెంపర్’ తమిళ వర్షన్ షూటింగ్ మొదలవ్వబోతుంది !

bs

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. వరుసగా ప్లాప్ లతో సతమవుతున్న ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం టెంపర్ కావడం విశేషం. అయితే ఈ చిత్రం తమిళ్ రీమేక్ అవ్వబోతుందని తెలిసిన విషయమే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్ పాత్రలను పోషిస్తున్నారు.

కాగా ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ సిద్ధం అయింది. మొదటి షెడ్యూల్ కోసం చెన్నై శివార్లలోని ఒక ప్రత్యేక సెట్ ను కూడా ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ సెట్ లో విశాల్ మరియు రాశి ఖన్నా మధ్య సాగే సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ‘అయోగ్య’ అనే పేరుతో రాబోతుంది ఈ చిత్రం. కాగా ఈ రోజు చిత్రబృందంతో కలిసి నిర్మాతలు పూజ వేడుకలో పాల్గొన్నారు.

Exit mobile version