కేజిఎఫ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్…!

Published on Aug 29, 2019 12:33 pm IST

యంగ్ హీరో యష్ స్టార్ డమ్ ని మార్చేయడమే కాకుండా, కన్నడ చిత్ర పరిశ్రమకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రంగా కేజీఎఫ్ ని చెప్పుకోవచ్చు. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పెను సంచనాలు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషలలో రికార్డు వసూళ్లు సాధించింది. దీనితో మొదటి పార్ట్ కి మించి భారీ ఎత్తున సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కాగా ఈ చిత్రానికి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతుందంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.దీనికి స్పందించిన న్యాయస్థానం వెంటనే సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతున్న కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ను ఆపాలని ఆదేశాలిచ్చింది. దీనితో అయోమయానికి లోనైన చిత్ర యూనిట్ ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డారట. దీనితో ఈ చిత్ర విడుదల ఆలస్యం అవడంతో పాటు, బడ్జెట్ పెరిగే అవకాశం కలదు. కేజిఎఫ్2 మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చేదు వార్తే అని చెప్పాలి.

ఈ చిత్రంలో యస్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడైన అధీరా పాత్ర చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఆయన లుక్ కి మంచి స్పందన వచ్చింది.

సంబంధిత సమాచారం :