నడిగర్ సంఘం ఎన్నికలలో విశాల్ కి భారీ షాక్

Published on Jun 20, 2019 8:11 am IST

సార్వత్రిక ఎన్నికలకు తీసిపోనంతగా తమిళ సినీపరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ప్రధాన కూటములైన నాజర్‌-విశాల్‌, భాగ్యరాజ్‌-ఈశ్వరి గణేషన్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వేడిరాజేస్తున్నారు. ఇటీవలే సీనియర్ దర్శకుడైన భారతీ రాజా తమిళ పరిశ్రమపై తెలుగువాడైన విశాల్ పెత్తనమేంటని తీవ్రస్థాయిలో విమర్శించాడు.

ఇంత సీరియస్ గా ఎన్నికల వాతావరణం నెలకొన్న పరిస్థితితులలో తమిళనాడు రిజిస్టర్ అఫ్ సొసైటీ ఈ ఎన్నికలను వాయిదా వేయడంతో అందరు షాక్ తిన్నారు. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన నడిగర్‌ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ బుధవారం నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.గతంలో నడిగర్ సంగం నుండి బహిష్కరించబడిన 61మంది సభ్యులు ఎన్నికలపై చేసిన పిర్యాదు మేరకు రిజిస్టర్ అఫ్ సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామం విశాల్ విజయానికి గండికొట్టే విధంగా ఉండటంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. ఈ 61మంది సభ్యుల సభ్యత్వంపై తీర్పు వెలువడిన తరువాత నడిగర్ సంఘం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తారట.

సంబంధిత సమాచారం :

More