పది రోజుల్లో ‘మహర్షి’.. మరి బజ్ ఎక్కడా ?

Published on Apr 29, 2019 11:25 am IST


స్టార్ హీరో సినిమా వస్తుందంటే.. రెండు మూడు వారాల ముందు నుంచే.. ఆ సినిమా పై విపరీతమైన బజ్ ఉంటుంది. కానీ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకు ఉండాల్సిన స్థాయిలో బజ్ మాత్రం లేదు. ఈ చిత్రం మే 9వ తేదీన విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. సాధారణ ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తిని పెంచలేకపోతుంది మహర్షి చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన పాటలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేకపోవడం కూడా సినిమా పై అంచనాలను పెంచలేకపోయాయి.

మహర్షి టీజర్ కూడా మహేష్ అభిమానులకు బాగా నచినప్పటికీ సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వీటికి తోడు మహర్షి పోస్టర్స్ లో, టీజర్ లో ఎక్కడో ఓ చోట ‘శ్రీమంతుడు’ సినిమా గుర్తుకు రావడం కూడా మహర్షి సినిమాకు పెద్ద మైనస్ గా మారింది, ఇప్పటి నుండైనా మహర్షి టీమ్ తమ సినిమాలో ‘శ్రీమంతుడు’ ఛాయలు లేకుండా చేసుకుని.. సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా చేస్తే.. బాగుంటుంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :