తెనాలి రామకృష్ణ బిఎ బిల్ టీజర్: సందీప్ కిషన్ కామెడీ యాంగిల్ .

Published on Sep 15, 2019 12:00 pm IST

ఇటీవల నిను వీడని నీడను నేను వంటి హార్రర్ థ్రిల్లర్ మూవీతో మంచి విజయం అందుకున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. కామెడీ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో సందీప్ కిషన్ హాస్యంతో కూడిన లాయర్ పాత్ర చేయడం విశేషం . కాగా ఈ చిత్ర టీజర్ ని నేడు విడుదల చేయడం జరిగింది.

కేసుల కోసం నానా ప్రయాసలు పడే చెట్టు కింద ప్లీడర్ పాత్రలో సందీప్ కనిపిస్తారని ఈ చిత్ర టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కేసులు లేని కుర్ర లాయర్ సందీప్ సమస్యలతో కూడుకున్న వరలక్ష్మి అనే మహిళ కేసు వాదించడానికి ఒప్పుకోవడం, దాని వలన ఎదురయ్యే తిప్పల సమాహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన చేస్తున్న హన్సిక మోత్వానీ కూడా లేడీ లాయర్ గా చేస్తున్నారు. రాధికా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది.

కమెడియన్స్ వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, కిన్నెర, అన్నపూర్ణ లతో పాటు మురళి శర్మ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇది అతనికి 75వ చిత్రం కావడం విశేషం.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More