“ఫ్యామిలీ మ్యాన్ 2″కి వారి నుంచి మొదలైన టెన్షన్.!

Published on May 20, 2021 9:03 am IST

ప్రస్తుతం మన ఇండియన్ ఎంటర్టైనింగ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”. ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ నుంచి నిన్ననే ఇంటెన్స్ ట్రైలర్ కట్ సహా విడుదల తేదీని కూడా మేకర్స్ కట్ చేసి విడుదల చేశారు. ఇక ఇదిలా ఉండగా గతంలో ప్రైమ్ వీడియోలో విడుదలకు వచ్చింది వెబ్ సిరీస్ ల లానే దీనికి కూడా ఊహించని ట్విస్ట్ చోటు చేస్తుంది.

ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తమకి వ్యతిరేఖంగా ఉందని తమిళనాడు ఆడియెన్స్ పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రెండ్ చేస్తూ తమ వ్యతిరేఖతను వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి సీజన్లో ముంబైలో సెటప్ చేసిన టీం ఈసారి చెన్నైలో చేసినట్టుగా ట్రైలర్ ద్వారా చూపించారు. మరి ఈ కోణంలోనే తమిళ ఆడియెన్స్ సోషల్ మీడియాలో ప్రైమ్ వీడియో మరియు ఈ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే లపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వారి నుంచి మొదలైన ఈ టెన్షన్ ఎంత వరకు వెళ్ళనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :