నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే అఖండ 2 (Akhanda 2) తాండవం. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ తో కూడా మంచి బుకింగ్స్ సాధించి తెలుగు స్టేట్స్ లో స్టాండర్డ్ గా వెళ్ళింది. ఇక ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత నెక్స్ట్ ఓటిటి రిలీజ్ కే రావాల్సి ఉంది. మరి దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
నెట్ ఫ్లిక్స్ లో డేట్ ఫిక్స్ అయ్యిందా?
అఖండ 2 (Akhanda 2 OTT) సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీరు ఈ జనవరి 9 నుంచి రానున్నట్టు వినిపిస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది.
ఈసారి కూడా రీచ్ వస్తుందా?
గతంలో పార్ట్ 1 పాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ పార్ట్ 2 థియేటర్స్ లో అంత రెస్పాన్స్ అందుకోలేదు. కానీ ఇప్పుడు ఓటిటిలో పాన్ ఇండియా భాషల్లోనే రానుంది. సో ఈసారి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.


