రామ్ చరణ్ బ్రూస్‌లీ ఆడియో రిలీజ్ డేట్?

Ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే ఎంతో ఆసక్తికరంగా కనిపించిన ఈ సినిమా, ఇప్పుడు చివరిదశకు చేరి మరో నెలరోజుల్లో విడుదలకు సిద్ధమయ్యేసరికల్లా విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. ఈనెల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను జరిపేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.

‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి పెద్ద సినిమాల తర్వాత ఆ స్థాయి అంచనాలతో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను నిర్వహించాలని బ్రూస్‌లీ టీమ్ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 26న ఆడియోను రిలీజ్ చేయనున్నారని సమాచారం. మెగా ఫ్యామిలీ హీరోల సమక్షంలో భారీ ఎత్తున ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. కాగా ఈ విషయమై బ్రూస్‌లీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.

Exit mobile version