తెరవెనుక ఆడియో విడుదల

తెరవెనుక ఆడియో విడుదల

Published on Dec 13, 2020 8:00 AM IST

tara venuka

జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై శ్వేతా వర్మ,సంపత్ రెడ్డి,ఆనంద చక్రవర్తి లు నటీ నటీలుగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టిఎన్ఆర్ , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి నటీనటులుగా మురళి జగన్నాథ్ మచ్చ నిర్మిస్తున్న తెరవెనుక చిత్రం ఆడియో కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన డి.ఐ.జి.సుమతి(ఉమెన్స్ & చైల్డ్ ప్రొటెక్షన్ సెల్) ఆడియో ను విడుదల చేయగా,దర్శకుడు శంకర్,సుచిర్ ఇండియా లయన్ కిరణ్,నిర్మాత గురురాజ్,సంఘసేవకుడు రేగొండ నరేష్,నటుడు శివారెడ్డి లు చిత్రం యొక్క పాటలను విడుదల చేశారు..అనంతరం

ముఖ్య అతిధులుగా వచ్చిన డి.ఐ.జి.సుమతి మాట్లాడుతూ… ఈ చిత్రం ట్రైలర్ నన్ను ఎంతో ఆకట్టుకుంది..ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురు కు జరిగిన అన్యాయం గురుంచి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు దానికి లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది.ఇందులో సీన్ చూస్తుంటే మహిళల పైన జరుగుతున్న అంశాలను ఇందులో చూయించినట్లు తెలుస్తుంది
అమ్మాయిలను గౌరవించేలా సినిమా, సీరియల్స్ ద్వారా యువతకు మొటివేట్ చేయగలగాలి. మహిళ పైన యునైటెడ్ నేషన్ సేర్వే చేస్తే తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే తను తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మల్టి టాస్కింగ్ చేయడమెగాక తను మ్యూనికేషన్ చక్కగా చేయగలదు, ఒక విషయాన్ని డిఫ్రెంట్ వే లో ఆలోచించే క్రియేటివిటీ కూడా మహిళకు ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి అమ్మాయి సూపర్ కాప్ గా మారితే మనం సక్సెస్ అయినట్లు..కనుక ఇలాంటి అంశాల మీద సినిమాలు నిర్మిస్తే ప్రస్తుతం సమాజం లో ఆడపిల్లలపై జరుగుతున్న వాటిని అరికట్టిన వారిమవుతాము.

ప్రస్తుత పరిస్థితుల్లో యువత యొక్క ఆశలను ,ఆశయాలకు తగ్గట్టుగా ఎలాంటి సినిమా చూడలను కుంటున్నారో దానికి అతి దగ్గరగా వెళ్లలేక పోతున్నాడు.హాలీవుడ్ లో పెద్ద బడ్జెట్ తో చాలా చిన్న ఇన్సిడెంట్ ను తీసుకొని 1.30 నిమిషాలు ఎంత రక్తి,అనురక్తి కలిగిస్తూ.. ప్రతి మూమెంట్ మిస్ కాకుండా ప్రేక్షకుడు చూసేలా తీస్తున్నారు..అలాంటి సినిమా మనమెప్పుడు తీయగలుగుతామంటే రియల్ థింగ్ సొసైటీ ను గ్రాఫ్ చేసి ఆర్జిస్ట్ ప్రెజెంట్ చేయగలిగాలి అలాంటి మూవీ ఇది అవుతుందని ఆశిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ప్రత్యేకించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ఈ చిత్ర దర్శక,నిర్మాత లకు మరియు ఎంటర్ క్రూ కు ధన్యవాదాలు తెలుపుతూ చిత్రం మంచి విజయం సాధించాలని అన్నారు..

దర్శకుడు యన్. శంకర్ మాట్లాడుతూ…తెరవెనుక మూవీ ఆడియో,ట్రైలర్ ను విడుదల చేసిన సుమతి మేడం కు ధన్యవాదాలు..ట్రైలర్ ను అన్ని భాగాలు కలిపి మిక్స్డ్ గా చూపుతారు..కానీ ఇందులో సీన్ కట్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు యువత ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని డైరెక్టర్ ప్రవీణ్ చందర్ చాలా స్పష్టంగా చెప్పాడు.సుమతి మేడం రియాల్టీగా చెప్పారు. ఒక పోలీస్ ఆఫీసర్,ఒక సిటీజయన్ గానే కాకుండా ఒక సినిమా ప్రేక్షకురాలిగా కూడా స్ఫూర్తినిచ్చే విదంగా మాట్లాడింది. వారికి నా ధన్యవాదాలు.మనము ఈ రోజు ఇంత ప్రశాంతంగా యూ డడానికి కారణం తెరవెనుక ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో వారి త్యాగాలు ఉన్నాయి.అలాంటివి ఈ దులో చేయించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ ప్రవీణ్ తో నా స్నేహం 25 సంవత్సరాలు. ఈ సినిమాను చక్కగా తీసాడు..ఈ సినిమాకు రఘురామ్ చక్కటి సంగీతం అందించాడు..కాసర్ల శ్యామ్ రాసిన పాటలు చాలా బాగున్నాయి.. నిర్మాత మురళి జగన్నాథ మచ్చ తెరవెనుక ఉండి మంచి సినిమా నిర్మించాడు ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి అన్నారు..

ఇందులో నటించిన నటీనటులు శ్వేతా వర్మ,సంపత్ రెడ్డి,ఆనంద చక్రపాణి లు మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా మేము ఏంతో నేర్చుకున్నాము.ఇంత మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్టు లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్య వాదాలు అని అన్నారు…
డైరెక్టర్ నెలుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ… డైరెక్టర్ కు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత మంచి నటులున్నా తీయగలిగే నిర్మాత లేకపోతే వేస్ట్..సమాజం లో జరిగే ఇష్యూ ను తీసుకొని ఈ సినిమా చేస్తున్నాను.ఇందులో అందరూ మంచి ఆర్టిస్టులు దొరికారు.రఘురాం,కాసర్ల శ్యామ్ లు మంచి సంగీతం,పాటలు అందించారు..సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న “తెరవెనుక” చిత్ర ఈ నెల 25 న సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. నిర్మాత మురళి జగన్నాధ్ మచ్చ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. అందరి అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉండబోతోందని తెలిపారు.

నిర్మాత మురళి జగన్నాథ్ మచ్చ మాట్లాడుతూ.దర్శకుడు నాతొ సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథను చెప్పినపుడు చాలా ఎక్సయిటింగ్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటిస్తున్నాడు,విశాఖ ధిమాన్,దీపిక రెడ్డి లు హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ చిత్రం చూసిన ప్రేక్షకులకు ఆలోచింపజేస్తుంది.ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.ఈ నెల 25 న విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించి ప్రేక్షకులు మాకు మంచి విజయం అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు