టీఎఫ్‌టీడీడీఏ (TFTDDA) సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం

టీఎఫ్‌టీడీడీఏ (TFTDDA) సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం

Published on Aug 5, 2015 2:32 PM IST

DANCE-DIRECTORS1
‘తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ (TFTDDA) ఆధ్వర్యంలో పలువురు అసోసియేషన్‌ సభ్యుల పదవీ విరమణ కార్యక్రమం ఈ ఉదయం ఘనంగా జరిగింది. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ఈ వేడుకను అసోసియేషన్ నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక సందర్భంగా అసోసియేషన్ తరపున పదవీ విరమణ పొందిన ఒక్కొక్కరికీ 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఇప్పటివరకూ పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్కరికీ ఇదే తరహాలో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చినా, ఈసారి మొత్తం 70 మంది సభ్యులు ఒక్కసారే పదవీ విరమణ పొందనుండడంతో అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచన చేశామని నిర్వాహకులు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా మొత్తం 2 కోట్ల 10 లక్షల రూపాయలను అసోసియేషన్ తరపున రిటైరైన సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరరించే దిశగా సరైన కృషి చేస్తోందని అసోసియేషన్ నిర్వాహకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు