థలా అజిత్ 25 లక్షల సాయం.!

Published on May 14, 2021 2:56 pm IST

మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఎలాగో కోలీవుడ్ లో కూడా థలా అజిత్ మరియు థలపతి విజయ్ లు కూడా అంతే వీరి మాస్ ఫాలోయింగ్ అనన్య సామాన్యం వీరు చెప్పే మాట చేసే చర్య వారి అభిమానులకి శాసనం. మరి అందుకు తగ్గట్టుగానే వీరు కూడా తమ చర్యలతో అభిమానులు తప్పు దారి పట్టకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు సామాజికంగా ముందుంటారు.

అయితే థలా అజిత్ ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే తమిళ నాట కోవిడ్ ఇబ్బందుల్లో డ్రోన్స్ తో చేసిన వినూత్న ప్రయత్నం వైరల్ అయ్యింది. మరి ఇదే అనుకుంటే ఇప్పుడు అజిత్ తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించి కరోనా బాధితులకు అండగా నిలిచారు. మరి ప్రస్తుతం అజిత్ హెచ్ వినోత్ దర్శకత్వంలో “వాలిమై” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :