ఇడ్లీలు అమ్మే వ్యక్తికి అజిత్ పెద్ద సహాయం

Published on Jan 20, 2021 5:05 pm IST

తమిళ స్టార్ హీరో అజిత్ కు హైదరాబాద్ నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. అజిత్ హీరో కాకముందు హైదరాబాద్ సిటీలోనే కొన్నాళ్ళు ఉన్నారు. అందుకే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సొంత ఊరికి వచ్చినట్టు ఫీలవుతుంటారు అజిత్. అజిత్ ప్రస్తుతం చేస్తున్న ‘వాలిమై’ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోనే జరిగింది.

షూటింగ్ జరిగినన్ని రోజులు అజిత్ తన సిబ్బందిని పక్కనపెట్టి సొంత బైక్ మీదే తిరిగారు. షూటింగ్ అయిపోయాక కొన్నిసార్లు అజిత్ రాత్రి సమయంలో దగ్గరే ఉన్న ఇడ్లీ బండి వద్దకు వెళుతుండేవారట. అలా వెళుతూ వెళుతూ ఆ ఇడ్లీలు అమ్మే వ్యక్తి పిల్లల గురించి, ఆ పిల్లలను చదివించడానికి అతను పడుతున్న కష్టాన్ని గురించి తెలుసుకుని వారి చదువుల కోసం తనవంతుగా లక్ష రూపాయల సహాయం చేశారట. తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అజిత్ ఆ విషయాలను బయటకురాకుండా చూసుకుంటుంటారు. ఎంతైనా అజిత్ మనసు పెద్దదే. ఇకపోతే హెచ్. వినోత్ దర్శకత్వంలో చేస్తున్న ఈ ‘వాలిమై’ చిత్రం వేసవికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :