భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన స్టార్ హీరో !

Published on Apr 7, 2020 4:48 pm IST

తమిళ సినీ ఇండస్ట్రీలోనే ఓ ప్రత్యేకమైన స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఏకైక హీరో ‘అజిత్’నే. అజిత్ ఏమి చేసినా ప్రత్యేకమే.. ఆయకున్న ఫాలోయింగ్ కూడా అతీతమైనదే. ఇక కరోనా వైరస్‌ మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు అజిత్ రూ. కోటి 25 లక్షల రూపాయిలను విరాళంగా ప్ర‌క‌టించారు.

ప్రధాన మంత్రి స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లును, తమిళనాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లను, అలాగే సినీ వర్కర్స్ యూనియన్ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ కోసం మరో రూ. 25 ల‌క్ష‌లను అజిత్ విరళంగా అందిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. అజిత్ ఫ్యాన్స్ తమ హీరో గొప్పతనం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

కాగా అజిత్ ప్రస్తుతం చేస్తోన్న నూతన చిత్రం ‘వాలిమై’. ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావం తగ్గాక పలు యాక్షన్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. అందులో ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని తమిళ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More