అజిత్ ముగించేశాడు !

Published on Apr 3, 2019 11:55 am IST

ఇటీవల విశ్వాసం తో ప్రేక్షకులముందుకు వచ్చిన అజిత్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. నెర్కొండ పరవాయ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో అజిత్ ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ పోషించిన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ షెడ్యూల్ లో అజిత్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేశాడు.

హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విద్యా బాలన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :