మళ్ళీ సూన్ లోకే వెళ్లిన స్టార్ హీరో ఫస్ట్ లుక్.!

Published on Jun 27, 2021 11:42 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా ఫస్ట్ లుక్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అలాగే కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వాలిమై” ఫస్ట్ లుక్ కోసం కూడా చూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై మేకర్స్ ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్నారు. అయితే రెండు సార్లు అధికారికంగా ఈ ఫస్ట్ లుక్ అనౌన్సమెంట్ వాయిదా పడింది.

మొన్ననే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై అధికారిక ప్రకటన వస్తుంది అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. కానీ అది జరగలేదు. మరి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా వాలిమై ఫస్ట్ లుక్ కమింగ్ సూన్ (అతి త్వరలోనే) వస్తుంది అలాగే అది కూడా అంచనాలకు తగ్గట్టే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. దీనితో మళ్ళీ ఈ ఫస్ట్ లుక్ సూన్ లోకే వెళ్లిందని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :