భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో అజిత్ “వలిమై”.!

Published on Jul 4, 2021 8:44 pm IST

తమిళ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అలాగే కొన్నాళ్ల నుంచి మరింత హైప్ పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా తొందరలోనే విడుదల కావడానికి రెడీగా ఉంది. అయితే ఇంత హైప్ లో ఈ చిత్రం భారీ స్థాయి బిజినెస్ నే చేసినట్టు తెలుస్తుంది.

ఒక్క థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాకుండా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు కూడా మొత్తం 200 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. ఇది ఒక్క అజిత్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా భారీ మొత్తం అని తెలుస్తుంది. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని దీపావళి రేస్ లో నిలపనున్నట్టుగా కూడా టాక్. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :