భారీ ధరకు అజిత్ “వాలిమై” హక్కులు?

Published on Mar 31, 2021 1:00 pm IST

కోలీవుడ్ మాస్ అండ్ స్టార్ హీరోల్లో ఒకరైన థలా అజిత్ హీరోగా ఇప్పుడు “వాలిమై” అనే భారీ యాక్షన్ పోలీస్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తుండడంతో ఆటోమేటిక్ గా ఆ వైబ్స్ కూడా మొదలయ్యాయి.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి బిజినెస్ పై కూడా ఇప్పుడు టాక్ బయటకి వచ్చింది. తమిళనాట ఈ చిత్రం తాలూకా థియేట్రికల్ హక్కులు 70 కోట్లకు పైగా అమ్ముడుపోయాయట. ఇది పోస్ట్ కోవిడ్ రికార్డు స్థాయి బిజినెస్ అని చెబుతున్నారు. అంతే కాకుండా అజిత్ కెరీర్ లో ఇది మూడో సినిమా అన్నట్టు తెలుస్తుంది.

ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాని ఈ చిత్రానికి కేవలం అక్కడే మంచి ధర పలకగా ఇక ఓవరాల్ గా అన్ని హక్కులు కలిపి భారీ ఎత్తునే ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ఆగస్ట్ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్..

సంబంధిత సమాచారం :