థలా అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ రచ్చ మొదలైంది.!

Published on Jun 25, 2021 8:00 am IST

మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కూడా ఒకరు. మరి అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా “వాలిమై” పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వాటి కన్నా ముందు అభిమానులు మాత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీనితో అది కాస్తా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే మరి ఎప్పుడో మే నెలలోనే లాంచ్ కావాల్సి ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ అప్డేట్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆల్రెడి సోషల్ మీడియాలో థలా అభిమానులు రచ్చ కూడా స్టార్ట్ చేసేసారు.

ఇప్పటికే ఓ రేస్ విజువల్ ను అభిమానులు ఫిక్స్ అయ్యియిపోయారు మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ పోస్టర్ ఉంటుందో లేదో ఆ డేట్ ఎప్పుడో చూడాలి. ఇక ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :