తలైవర్ రజినీకు ప్రతిష్టాత్మక “దాదా సాహెబ్ పాల్కే” పురస్కారం.!

Published on Apr 1, 2021 10:48 am IST

ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా లెజెండరీ నటుడు తలైవర్ సూపర్ స్టార్ రజినీకి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. తనదైన శైలి నటన స్టైల్ తో సరికొత్త ట్రెండ్ ను తనకంటూ సెట్ చేసి ప్రపంచంలోనే విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు రజినీకు గాను మన దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారం అయినటువంటి దాదా సాహెబ్ పాల్కే అవార్డు ను ప్రెజెంట్ చేసినట్టుగా యూనియన్ మినిష్టర్ ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు..

2019 సంవత్సరం కి గాను ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రేటెస్ట్ నటుల్లో ఒకరైన రజినీకు ఈ పురస్కారాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే తాను జ్యూరీ సభ్యులు అయినటువంటి ఆశా భొశ్లే, సుభాష్ తదితరులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. మరి రజినీకు ఈ అత్యున్నత పురస్కారం రావడంతో అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజినీ కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :