యూఎస్ వీధుల్లో దర్శనమిచ్చిన “అన్నాత్తే”.!

Published on Jun 26, 2021 3:02 pm IST

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా తమిళ్ స్టార్ దర్శకుడు శివతో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “అన్నాత్తే”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇటీవలే కొంతమేర షూట్ ను హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకుంది. అయితే ఇక్కడ షూట్ తో దాదాపు సగానికి షూట్ కంప్లీట్ చేసిన రజినీ వెంటనే ఓ చికిత్స నిమిత్తం కేంద్ర అనుమతితో యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి వెళ్లారు.

మరి అక్కడ ఆపరేషన్ సక్సెస్ గా కంప్లీట్ చేసేసుకున్నట్టు ఉన్నారు. ఆ హాస్పిటల్ బయట యూఎస్ వీధుల్లో తన కుమార్తె సౌందర్యంతో దర్శనం ఇచ్చారు. దీనితో తలైవర్ ఆల్ రైట్ అని అర్ధం అయ్యిపోయింది. ఇక రజిని నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రజిని మళ్ళీ షూట్ కి సిద్ధం అయ్యినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :