తలైవా 165 నెక్స్ట్ షెడ్యూల్ యూరప్ లో !

Published on Sep 2, 2018 10:20 am IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న165 వ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుంది. ఇక ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ తరువాత లఢక్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినాయకచవితి రోజు సెప్టెంబర్ 13న విడుదలచేసే అవకాశాలు వున్నాయి.

సిమ్రాన్ , నవాజుద్దిన్ సిద్దిఖీ, ఫహద్ ఫాసిల్ విజయ్ సేతుపతి, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. రజినీ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :