విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jun 17, 2021 7:02 pm IST

ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ముందు జార్జియాలో మొదలైంది. అక్కడ హెవీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ప్రసుతానికి షూటింగ్ నికిచిపోయి ఉండగా త్వరలో మొదలుపెట్టే సన్నహాల్లో ఉన్నారు టీమ్. అయితే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఎందుకంటే విజయ్ సినిమా ఫస్ట్ లుక్ అంటే అభిమానులకు పండుగ లాంటిది. అందుకే ఈ ఎదురుచూపులు. వారికోసమే మేకర్స్ కూడ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే వారం అనగా జూన్ 22న తేదీన ఫస్ట్ లుక్ విడుదల చేయాలని చూస్తున్నారు టీమ్. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా మనోజ్ పరమహంస డీవోపీగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :