కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసేసిన థలపతి విజయ్.!

Published on Apr 25, 2021 2:02 pm IST

కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో థలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” అటు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మరి ఈ సినిమాతో మన దగ్గర కూడా మంచి మార్కెట్ ను కూడా విజయ్ సెట్ చేసుకున్నాడు. ఇక దీని తర్వాత విజయ్ అక్కడ మరో టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మరో సాలిడ్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు.

అయితే ఈ చిత్రం తాలుకా మొట్ట మొదటి కీలక షెడ్యూల్ ను మేకర్స్ కొన్ని రోజుల కితమే జార్జియా దేశంలో ప్లాన్ చేసారు. అయితే ఈ సీన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్ ఉంది. మొత్తానికి ఈ షెడ్యూల్ ను విజయ్ విజయవంతంగా పూర్తి చేసేసి ఈరోజే చెన్నైలో అడుగు పెట్టాడు. ఇక ఈ భారీ చిత్రంకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుంది.

సంబంధిత సమాచారం :