షారుఖ్ సినిమాలో దళపతి విజయ్?

Published on Sep 23, 2022 12:59 pm IST

ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రాల్లో కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో చేస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “జవాన్” కూడా ఒకటి. హిందీ సహా తమిళ్ లో తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రంపై ఇప్పుడు కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

నిన్న అట్లీ తాను షారుఖ్ అలాగే ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కలిసి ఉన్న ఫోటో ని షేర్ చెయ్యగా అది సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే ఇక్కడ నుంచి కొన్ని షాకింగ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. షారుఖ్ సినిమాలో విజయ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంటూ కొన్ని మాటలు స్టార్ట్ కాగా అసలు వీటిపై అయితే క్లారిటీ తెలుస్తుంది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అది నార్మల్ గా తీసుకున్న ఫోటో ని టాక్. దీనితో అయితే ప్రస్తుతానికి షారుఖ్ సినిమాలో విజయ్ లేడనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :