“బీస్ట్”తో విజయ్ టార్గెట్ మళ్ళీ అప్పటికే.?

Published on Jun 22, 2021 12:00 pm IST

ఇళయ థలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇపుడు సౌత్ ఇండియన్ సోషల్ మీడియా షేక్ అవుతుంది. మరి ఈ బర్త్ డే స్పెషల్ గా తాను నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను మేకర్స్ రివీల్ చెయ్యడంతో దానికి కూడా భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. “బీస్ట్” అనే టైటిల్ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఫీస్ట్ ఇచ్చిన విజయ్ ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారో అన్నదానిపై బజ్ వినిపిస్తుంది.

ఎప్పటి లానే ఈసారి కూడా విజయ్ ఫెస్టివల్ సీజన్లోనే పలకరించనున్నాడట. అయితే తన లాస్ట్ చిత్రం “మాస్టర్” విడుదల కాబడిన సంక్రాంతి సీజన్లోలోనే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలవనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :