స్టార్ కమెడియన్ కి సర్ప్రైజ్ ఇచ్చిన దళపతి విజయ్.!

స్టార్ కమెడియన్ కి సర్ప్రైజ్ ఇచ్చిన దళపతి విజయ్.!

Published on Dec 10, 2022 11:00 AM IST

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో “వారిసు” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత అయితే తన కెరీర్ 67వ సినిమా కూడా చేయనున్నాడు. ఇక ఇలా తన సినిమాలతో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తున్న తాను లేటెస్ట్ గా తమిళ నాట స్టార్ కమెడియన్ అయినటువంటి యోగిబాబు కి సర్ప్రైజ్ ఇవ్వడం వైరల్ గా మారింది.

మరి తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి హెల్మెట్, బ్యాట్ పట్టుకొని ఈ బ్యాట్ దళపతి విజయ్ అన్న సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపించారని దానితో ఫోటో షేర్ చేసి అయితే ఆనందం వ్యక్తం చేయగా ఈ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ ఇద్దతి కాంబినేషన్ లో అయితే ఎన్నో సినిమాలు వచ్చాయి. సర్కార్, బిగిల్ తదితర ఎన్నో చిత్రాల్లో నటించిన తాము లేటెస్ట్ గా అయితే చిత్రం వారిసు లో కూడా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు