ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తో “లియో” అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా కోలీవుడ్ హిస్టరీ లోనే రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ ని అయితే జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా విజయ్ కెరీర్ లో మరో ఊహించని ప్రాజెక్ట్ ని అయితే లాక్ చేసినట్టుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.
మరి ఆ దర్శకుడు ఎవరో కాదు తన ఇంటెన్స్ చిత్రాలతో మూవీ లవర్స్ కి పర్ఫెక్ట్ సినిమాలు అందించే దర్శకుడు వెట్రి మారన్ అట. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో అయితే ఇప్పుడు లాక్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో అయితే ఎలాంటి సినిమా రానుందో చూడాలి. అలాగే ఈ సినిమాపై అధికారిక అప్డేట్ కూడా ఇంకా రావాల్సి ఉంది.