దాదాపు పూర్తైన స్టార్ హీరో సినిమా !
Published on Jun 20, 2018 10:42 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 62వ చిత్రం యొక్క చిత్రీకరణ 80 శాతం ముగిసింది. మిగతా చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. త్వరలోనే ఈ షెడ్యూల్ మొదలుకానుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ రూపొందిస్తున్నారు.గతంలో విజయ్, మురుగదాస్ కాంబోనేషన్లో వచ్చిన ‘తుపాకి, కత్తి’ వంటి సినిమాలు భారీ విజయాల్ని అందుకొని ఉండటంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలున్నాయి.

ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకులకు అందివ్వనున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, యోగిబాబు, రాధారవి మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తుండగా ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదలకానున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook