తలపతి 63 ఇంట్రో సాంగ్ కోసం 100 మంది !

తలపతి 63 ఇంట్రో సాంగ్ కోసం 100 మంది !

Published on Feb 15, 2019 11:27 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న63వ చిత్రం ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలోని ఇంట్రో సాంగ్ కోసం 100 మంది పిల్లలను తీసుకుంటున్నారు. ఈ పాటలో విజయ్ తో పాటు వీరు స్టెప్పులు వేయనున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా లో విజయ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈచిత్రంలో డానియల్ బాలాజీ , ఆనంద్ రాజ్ , యోగి బాబు కథిర్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. అయితే నయన్ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది. ఇక తెరి , మెర్సల్ తరువాత విజయ్ – అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు