లఘాన్ తరహాలో విజయ్ 63 !

లఘాన్ తరహాలో విజయ్ 63 !

Published on Feb 5, 2019 11:20 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 63 వ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ప్రస్తుతంచెన్నై లో జరుగుతుంది. స్పోర్ట్స్ డ్రామా గా యువ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా రెహమాన్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు ఎన్నడూ సౌత్ ఇండియా సినీ చరిత్రలో ఇలాంటి స్క్రిప్ట్ రాలేదని ఈ చిత్రం ‘ లఘాన్ , పీలే’ తరహాలో ఉండనుందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఆయన వెల్లడించారు. సో దీన్ని బట్టి ఈ చిత్రం అట్లీ , విజయ్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందిచండం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తెరి , మెర్సల్’ సూపర్ హిట్ అయ్యాయి.

ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ఈచిత్రాన్నివిడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు